PM విద్యాలక్ష్మి పథకం: పేద విద్యార్థులకు ₹10 లక్షల వరకు ఆర్థిక సహాయం
మీరు లేదా మీ పిల్లలు డాక్టర్, ఇంజినీర్ లేదా ఇతర ఉన్నత డిగ్రీలు చదవాలనే కలలు కంటున్నారా? కానీ లక్షల రూపాయల ఫీజులు చూసి చదువు మధ్యలో ఆపేయాల్సి వస్తుందా?
ఇకపై డబ్బుల కొరత వల్ల చదువు ఆగకూడదు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుత పథకమే ‘ప్రధాన్ మంత్రి విద్యాలక్ష్మి యోజన’.
పేద మరియు మధ్యతరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పథకం నిజంగా ఒక వరం లాంటిది. ఈ పథకం సంబంధించిన పూర్తి వివరాలు ఇవే
ఈ పథకం ముఖ్య లక్షణాలు
ఎలాంటి గిరవి అవసరం లేదు
బ్యాంక్ లోన్ కోసం ఆస్తి పత్రాలు చూపాల్సిన అవసరం లేదు.
3% వడ్డీ రాయితీ
కుటుంబానికి సంవత్సరానికి వచ్చే ఆదాయం ₹8 లక్షల కంటే తక్కువగా ఉంటే, ₹10 లక్షల వరకు ఉన్న విద్యా రుణంపై 3 శాతం వడ్డీ రాయితీ అందుతుంది.
పూర్తిగా వడ్డీ మినహాయింపు
కుటుంబ ఆదాయం ₹4.5 లక్షల కంటే తక్కువగా ఉంటే, పూర్తి వడ్డీ మాఫీ కూడా వర్తిస్తుంది.
ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశం
దేశవ్యాప్తంగా ఉన్న 860కు పైగా గుర్తింపు పొందిన నాణ్యమైన విద్యా సంస్థల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.
అర్హతలు
- దరఖాస్తుదారు భారతీయ పౌరుడై ఉండాలి
- మెరిట్ ఆధారంగా గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందాలి
- కుటుంబ వార్షిక ఆదాయం ₹8,00,000 లోపే ఉండాలి (వడ్డీ రాయితీ కోసం)
- ఇతర ప్రభుత్వ స్కాలర్షిప్లు లేదా సబ్సిడీలు పొందకూడదు
- కోర్సును మధ్యలో వదిలేయకూడదు
అవసరమైన పత్రాలు
గుర్తింపు పత్రాలు
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు / ఓటర్ ఐడి
విద్యా సంబంధిత పత్రాలు
- గత తరగతి మార్కుల పట్టిక
- కాలేజీ అడ్మిషన్ లెటర్
ఆదాయ ధృవీకరణ
- తహసీల్దార్ జారీ చేసిన ఆదాయ సర్టిఫికెట్
ఇతర పత్రాలు
- ఫీజు వివరాలు
- కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
- బ్యాంక్ పాస్బుక్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
దరఖాస్తు చేసే విధానం
వెబ్సైట్ సందర్శించండి
pmvidyalaxmi.co.in
రిజిస్ట్రేషన్ చేయండి
‘Student’ అనే ఆప్షన్లో మీ లాగిన్ ఐడీ క్రియేట్ చేయండి
దరఖాస్తు పూరించండి
లాగిన్ అయిన తర్వాత ‘Apply for Education Loan’ పై క్లిక్ చేయండి
పత్రాలు అప్లోడ్ చేయండి
అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సరిగా అప్లోడ్ చేయండి
సబ్మిట్ చేయండి
అన్ని వివరాలు చెక్ చేసి అప్లికేషన్ను సబ్మిట్ చేయండి
కెనరా బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు రుణ ప్రక్రియను పూర్తి చేస్తాయి
చదువు ప్రతి ఒక్కరి హక్కు
డబ్బుల కోసం మీ కలలను మధ్యలో వదిలేయకండి.
ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి –
ఒక ప్రతిభావంతుడి భవిష్యత్తుకు మీరు కారణం కావచ్చు.
ముఖ్యమైన లింకులు
అధికారిక నోటిఫికేషన్ – Click Here
అధికారిక వెబ్సైట్ – Click Here





